ప్రపంచంలో
మొట్టమొదట రాసిన కవిత నుంచి
చిట్టచివరి అక్షరాన్ని తీసుకొని
ఈ కాలం రెక్కలు తొడిగాను
ఎగుర్తూ వెళ్లి
ఆకాశంపై వాలకుండా
నడుస్తూ వెళ్లి
మనిషిని కౌగిలించుకుంది.
బుగ్గలపై కన్నీటి చారికల్ని
ఓదార్పుగా తుడిచింది
పదునైన ఊహగా
అతడిలో ప్రవేశించింది
మనిషి ముఖం వ్యూహంతో
వెలిగిపోయింది
ప్రపంచంలో
చిట్టచివర రాసే కవితలో
మొట్టమొదటి అక్షరం అతడే.
మూలం-త్రిపురనేని శ్రీనివాస్ ('రహస్యోద్యమం' నుండి)
సేకరణ-శ్రీనివాస్
0 comments:
Post a Comment