skip to main |
skip to sidebar
కారు మబ్బులు కురులు
కలువ తామరలు కనులు
పున్నమి వెన్నెల మోము
పురివిప్పిన నెమలి నడక
నెలవంకనే విరిమల్లెలుగా
తన కురులలో నిలుపుకుందేమో
ఆ రవినే కుంకుమబొట్టుగా
తన నుదుట దాచిందేమో
ఏ కవి భావనకు
అంతుబట్టని కావ్యం ఆమె
ఏ చిత్రకారుని కుంచెకు
అంతుచిక్కని చిత్రం ఆమె.
-శ్రీనివాస్
0 comments:
Post a Comment